DSC/TRT COACHING BC STUDY CIRCLE

 పుస్తకాల ఖర్చులకు దరఖాస్తుల ఆహ్వానం





 డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ ఉద్యో గార్థులకు పుస్తకాల కొనుగోలు ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 అందించనున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. డీఎస్సీకి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు పది వేల మందికి అవకాశం ఉంటుందన్నారు. 7 వేల మంది ఎస్జీటీ, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇవ్వనున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీలోపు తమ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వైబ్సై ట్లో లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు..


డీఎస్సీ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచితంగా రూ.1500 బుక్ ఫండ్ , స్టడీ మెటీరియల్ కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులు టీచర్స్ (ఎస్జీటీ, స్కూల్ అస్టెంట్)లకు 10వేల మంది బీసీ అభ్యర్థులకు (7వేల మంది ఎస్జీటీలకు, 3వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు) రూ.1500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ అభ్యర్థులు  https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do  ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 5వ తేదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9573859598, 9441931359 నంబర్లలో సంప్రదించాల న్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ ను సంప్రదించాలని తెలిపారు.


ఎస్జీటీ ఉచిత శిక్షణకు

డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్షణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఈనెల 14 నుంచి 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని, ఎస్జీటీకి సంబంధించి ఇంటర్, డైట్, టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 75 రోజులపాటు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు తమ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వైబ్సైట్లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈబీసీ అభ్యర్థులకు డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ శ్రీలత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 22వ తేదిలోగా    https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do   లో దరఖాస్తులు అందించాలని తెలిపారు. ఈ నెల 26 నుంచి శిక్షణ ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేష న్ ప్రకారం ఎస్జీటికి సంబందించి ఇంటర్మిడియట్, డైట్, టెట్ లో సాదించిన మార్కుల ఆధారంగా తీసుకుంటామన్నారు. 75 రోజుల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. వివరాలకు 9573859598, 9441931359 నంబర్లలో సంప్రదించాలన్నారు.








Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT)
Telangana
Cell: 9440600025


Post a Comment

0 Comments