10th class 2024 విద్యార్థులు & ఇన్విజలేటర్లకు సూచనలు

‘పది’ పరీక్షలు రాస్తున్నారా? మార్కుల్ని పెంచే వ్యూహం ఇదిగో 


SSC 2024 PUBLIC EXAMINATIONS TIME TABLE:



మార్చి 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న వేళ పదో తరగతి విద్యార్థులకు కొన్ని కీలక సూచనలివే::

 తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) జరగబోతున్నాయి. విద్యార్థులంతా ప్రిపరేషన్‌ (Preparation)లో తీరికలేకుండా ఉన్నారు. పరీక్షలకు ఇంకా కేవలం ఐదు రోజులే ఉండటంతో విద్యార్థులు తాము ఏ సబ్జెక్టు బాగా చదివారో, దేన్ని సరిగా చదవలేదో నిజాయతీగా సమీక్షించుకొని అందుకనుగుణంగా ప్లాన్‌ చేసుకొని చదివితే మార్కుల్ని పెంచుకోవడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌తో పాటు పరీక్ష రాసేముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివే.. 

 ▶కొద్ది రోజుల్లో జరగబోయే ఈ పరీక్షల కోసం 3 ‘పీ’ వ్యూహాన్ని అనుసరించండి. అవి ప్లానింగ్‌ (ప్రణాళిక), ప్రిపరేషన్‌ (సన్నద్ధత), ప్రెజెంటేషన్‌ (సమర్పణ). అధిక మార్కులు సాధించాలంటే ఈ మూడింటినీ మెరుగ్గా పాటించడం ఎంతో ముఖ్యం.

 ▶పాఠ్యాంశాల పునశ్చరణకు వీలుగా సొంతగా టైం టేబుల్‌ రూపొందించుకొని చదవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సివుందని ఆందోళనకు గురికావొద్దు. ఇంతకుముందు చదివినవే కాబట్టి ప్రణాళిక ప్రకారం వేగంగా అవగాహనతో చదవడం ముఖ్యం.

 ▶ఇదివరకే పూర్తి స్థాయిలో అన్ని పాఠ్యాంశాల్నీ చదివి ఉన్నవారు అన్ని పాఠాల్లో కీలకాంశాలు, వ్యాకరణాంశాలు, ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.

 ▶పాఠాలను చదివిన తర్వాత ప్రశ్నలను ఊహించుకొని ‘ఫలానా ప్రశ్న వస్తే జవాబు రాయగలనా?’ అని కళ్లు మూసుకొని మననం చేసుకోవడం ఉత్తమం. బ్రేక్‌ పడితే ఎక్కడ సందేహం ఉందో దానిపై దృష్టి సారించి మరోసారి చదివి పట్టు సాధించాలి. గత మాదిరి ప్రశ్నపత్రాలు, పార్ట్‌-బిలను అభ్యాసం చేస్తే మేలు చేస్తుంది.

 ▶పరీక్ష రాసే ముందు.. ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చిన మార్కులు, జవాబు ఎలా? ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి.

 ▶ప్రశ్నపత్రం చేతుల్లోకి తీసుకోగానే హడావిడిగా రాయడం మొదలు పెట్టకూడదు. మొదటి 15 నిమిషాలను ప్రశ్నపత్రం చదవడానికి ఉపయోగించాలి. ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడంతోపాటు రాయడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకోవాలి.

 ▶ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ ఉన్నప్పుడు ప్రశ్నల ఎంపిక సరిగా ఉండాలి. కఠినంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన చెందొద్దు. తొలుత సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత కఠిన ప్రశ్నలకు వెళ్లండి. 

 ▶సమయంపై దృష్టి పెట్టండి. దేనికి ఎంత సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు కాషన్‌ బెల్‌ కొడతారు గనక కంగారు లేకుండా రాయండి. ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాసేలా జాగ్రత్త పడండి. 

 ▶జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య సరిగా వేశారా లేదా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా ముఖ్యం.

 ▶సైడ్‌ హెడ్డింగ్‌లను పెన్నుతో అండర్‌లైన్‌ చేయండి. మార్జిన్లను పాటించండి. కోడ్‌ పదాలను రాయొద్దు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయండి. ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడికి మీ పేపర్‌ పట్ల మంచి ఇంప్రెషన్‌ ఏర్పడటంతో పాటు మీరు రాసే జవాబుల్ని త్వరగా గుర్తించగలుగుతారు.


విద్యార్దులు ఈ వీడియో చూడండి:

 


SSC 2024 PUBLIC EXAMINATIONS TIME TABLE:




విద్యార్దులు ఈ వీడియో చూడండి:




 SSC Invigilator లకు సూచనలు:




MODEL OMR SHEET:




 


 SSC Invigilator లకు సూచనలు:


Invigilators ఎవరు కూడా examination centre కు cell phone తీసుకురావద్దు.

 1. ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు 8:30am కు సెంటర్ లో ఉండాలి
2. అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి
 3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది
 4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి 
 5. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి 
 6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి
 7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి. తమాదే అని సరిచేసుకోవాలి 
 8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి 
 9. విద్యార్థులు OMR పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి.మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి 
 10. 9.25am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్ చేయడం అయిపోవాలి
 11. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.
 12. OMR షీట్ పైన Answer Sheet నంబర్ వేయించాలి
 13. ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. వేయమని చెప్పాలి.
 14.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి 15. మ్యాప్, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.
 16. ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి
 17.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి. 
 18. ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు. 
 19. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి 20.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.
 21.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి 
 22.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి 
 23. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు
 24.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు
 25 ఏదైనా అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి 
 26.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు
 27. గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది
 28.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి 
 29. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి 
 30.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి
 31. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు
 32.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే సి ఎస్ /DO తెలియజేయాలి 
 33. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. 
 34.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి. వెరీ ఇంపార్టెంట్ 
 35. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి 
 36 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి 
 37. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది
 38. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి 
 39.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి 
 40. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు 
 41. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి
 42.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి 
 43. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది 
 44. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, మ్యాప్, లపై పూర్తి సంతకం చేయాలి.. 



 SSC SPOT VALUATION-MARCH-2024 to be conducted from 03.04.2024 to 11.04.2024 (9 days) and 19 Spot centers in the State.

HALL TICKETS కోసం క్రింద  CLICK చేయండి:




Thank you...



Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT)
Telangana
Cell: 9440600025


Post a Comment

0 Comments